Andhra Pradesh : గిరిజన గూడేలకు రోడ్లు.. ఇది కదా పాలన అంటే

Andhra Pradesh : గిరిజన గూడేలకు రోడ్లు.. ఇది కదా పాలన అంటే
X

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోంది. ప్రతి గ్రామానికీ మౌలిక సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో పలు ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వం కాలంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, కరెంట్ లైన్లను తీసుకొస్తూ గ్రామాల్లో వెలుగులు నింపుతోంది. ఇటీవల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని రొంపల్లిగూడం పరిధిలో ఉన్న పలు గిరిజన గ్రామాలకు విద్యుత్ కాంతులు అందించి కూటమి ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంది. 17 ఇండ్లు మాత్రమే ఉన్న ఒక గిరిశిఖర గ్రామానికి కూడా విద్యుత్ స్తంభాలు వేసి కరెంట్ సరఫరా కల్పించారు. దాంతో అక్కడి ప్రజల ఆనందానికి అవధుల్లేవు.

స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు ఈ గ్రామాలకు వెలుగులు వచ్చాయి. ఇన్నేళ్లుగా చీకటిలో మగ్గిన గ్రామాలకు కరెంట్ రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు స్థానిక గిరిజనులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం, తాగునీటి సదుపాయాలు కల్పించడం, విద్యుత్ సరఫరా చేయడం వంటి పనులు వేగంగా జరుగుతుండటంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. అభివృద్ధి అందరికి చేరాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న విధానం ఇప్పుడు గ్రామాల ముఖచిత్రాన్ని మార్చేస్తోందని చెప్పవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పవన్ కల్యాణ్‌ చొరవతో ఈ గ్రామాలకు అభివృద్ధి అందుతోంది.

గ్రామాల్లో వైసీపీ హయాంలో ఒక్క రోడ్డు కూడా రాలేదు. ఇక కొత్త కరెంట్ స్తంబాల మాట దేవుడెరుగు. గిరిజన గూడాలకు కరెంట్ అనే మాటనే లేదు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. వాస్తవానికి ఈ గ్రామాల గిరిజనులు కూడా వీటిని అడగకపోయినా.. చంద్రబాబు, పవన్ హామీలు ఇచ్చి వాటిని ఇలా అమలు చేస్తున్నారు. దీంతో గిరిజన ప్రజలు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఫొటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు.

Tags

Next Story