YS Jagan : అమరావతిని అడ్డుకోలేవ్ జగన్..!

అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఎప్పటి నుంచో జగన్ కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. పైగా మూడు రాజధానుల పేరుతో ఎన్నో డ్రామాలు తెరమీదకు తెచ్చారు. కానీ ఒక్క రాజధాని కూడా నిర్మించలేదు. అవన్నీ పేపర్లకు మాత్రమే పరిమితం చేసి అమరావతి రైతులకు తీరని ద్రోహం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు అనేక రకాల అభివృద్ధి పనులు చేస్తోంది. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ బ్యాచ్ ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అమరావతి నీటిలో మునిగిపోతుందని.. అక్కడ కట్టడం సాధ్యం కాదని ఇప్పుడు అంటున్నారు.
పైగా మావిగన్ అంటూ కొత్త పేరును తెరమీదకు తెస్తున్నారు. అంటే ఎక్కడ రాజధాని కట్టాలో కూడా ఆయనే చెప్పేస్తున్నారు. తాను చెప్పినట్టు వినాలని ఆయన ఇష్టారీతిన మాట్లాడటం మహా దారుణంగా ఉందనే చెప్పుకోవాలి. అంటే రాజధాని ఎక్కడ కట్టాలో.. ఎలా కట్టాలో కూడా ఆయనే చెప్పేస్తున్నారు. పైగా రాజధానిలో పెట్టుబడులు పెట్టుకుండా ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్నీ చేసేస్తున్నారు.
కానీ జగన్ ఎన్ని రకాల కుట్రలు చేసినా సరే అమరావతి అభివృద్ధి మాత్రం ఆగదు. ఆ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులతో పాటు ఇతర ప్రాజెక్టులు, కంపెనీల పెట్టుబడులతో రాజధాని అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే అమరావతికి చట్టబద్ధత కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జగన్ ఎన్ని రకాల కుట్రలు చేసినా సరే అమరావతిని అడ్డుకోవడం కలే అవుతుంది.
Tags
- Amaravati
- Amaravati capital controversy
- Andhra Pradesh
- Y. S. Jagan Mohan Reddy
- three capitals issue
- Amaravati farmers
- capital city debate
- Andhra Pradesh development
- coalition government Andhra Pradesh
- YSRCP allegations
- administrative decentralization
- AP political developments
- infrastructure development
- state governance
- political controversies
- regional politics
- Indian politics
- Amaravati investments
- capital region development
- central government support
- public policy debate
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
