Chandrababu Naidu : సీఎం చంద్రబాబు ముందు చూపు.. అగ్నిమాపక శాఖ ఆధునీకరణ

కాలానుగుణంగా వచ్చే ప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఎంత అప్రమత్తంగా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదైనా విపత్తు రాష్ట్రానికి వస్తోందంటే దాన్ని ముందే అంచనా వేసి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తుంటారు. ఏ ఒక్కరి ప్రాణ నష్టం జరగకుండా చూస్తుంటారు. ఇప్పుడు వేసవి కాలంలో కూడా అగ్రి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివి జరగకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. అందులో భాగంగానే రూ.253 కోట్లతో అగ్నిమాపక శాఖను ఆధునీకరిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నిధులు కూడా కేటాయించి అత్యాధునిక పరికరాలను అగ్నిమాపక శాఖలో తీసుకొచ్చారు. ఈ సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.
ఆ మేరకు అత్యాధునిక పరికరాలను ఉపయోగించుకుని పనులు చేయాలని సూచించారు. ఏ ఒక్కరి ప్రాణానికి కూడా నష్టం జరగొద్దని సూచించారు. ప్రజల ప్రాణాలకు మొదటి ప్రియారిటీ ఇవ్వాలని ఆదేశించారు. ఏ ఒక్కరికీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చూడాలని.. అవసరం అయితే ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు సూచించారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను వినియోగించుకుని అగ్ని ప్రమాదాలను నివారించాలన్నారు. ఇలా సీఎం చంద్రబాబు ముందస్తు చర్యలతో అగ్ని ప్రమాదశాఖకు మరింత ఊతం వచ్చినట్టే అయిందని చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీ హయాంలో అగ్ని ప్రమాద శాఖను ఎవరూ పట్టించుకోలేదు. గతంలో చంద్రబాబు హయాంలో పక్క రాష్ట్రాలకు సాయం చేసే స్థాయిలో ఏపీ అగ్నిమాపక శాఖ ఉండేదని.. దాన్ని ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
