AP Budget: ఏపీ అసెంబ్లీ ముందు బడ్జెట్ కేటాయింపులు.. ఏ రంగానికి ఎంతంటే..

AP Budget: ఏపీ అసెంబ్లీ ముందు బడ్జెట్ కేటాయింపులు.. ఏ రంగానికి ఎంతంటే..
AP Budget: 2 లక్షల 56 వేల 256 కోట్ల రూపాయలతో ఏపీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

AP Budget: 2 లక్షల 56 వేల 256 కోట్ల రూపాయలతో ఏపీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2 లక్షల 8 వేల 261 కోట్లు కాగా.. మూలధన వ్యయం అంచనా 47 వేల 996 కోట్లు. రెవెన్యూ లోటు అంచనా 17 వేల 36 కోట్లు కాగా, ద్రవ్యలోటు 48 వేల 724 కోట్లుగా పేర్కొన్నారు మంత్రి బుగ్గన. 3వ సారి అసెంబ్లీలో ఆర్థికపద్దు ప్రవేశపెట్టిన ఆయన.. కేటాయింపులైతే ఘనంగానే ప్రకటించారు.

ఆత్మస్తుతి-పరనింద అన్నట్టుగానే సాగింది ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం. ప్రసంగంలో తిరువళ్లూరు సూక్తులతో మొదలుపెట్టి మహాత్మాగాంధీ, APJ అబ్దుల్‌కలాం, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, యోగి వేమన, నోబెల్ గ్రహీత కైలాష్‌ సత్యార్థి, వంగరిమాతై ఇలా ఎందరో ప్రముఖుల్ని ప్రస్తావించారు.

ఇక ఎప్పటిలాగే.. పోలవరం ప్రాజెక్ట్‌ స్పష్టత ఇవ్వలేదు. 2023 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. అంతే తప్ప.. కచ్చితంగా పూర్తి చేస్తామని ఆర్ధికమంత్రి అసెంబ్లీలో ప్రకటించలేదంటున్నారు టీడీపీ నేతలు. ప్రసంగానికి అదనపు వన్నెలు అద్దుతూ ఈ తళుకులు, ఛెళుకులు ఎలా ఉన్నా.. అభివృద్ధి ప్రణాళిక విషయంలో కేటాయింపులన్నీ అసమగ్రంగా ఉన్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

  • ఏపీలో 2022-23 వార్షిక బడ్జెట్‌ - రూ. 2, 56 256 కోట్లు
  • రెవెన్యూ వ్యయం అంచనా - రూ. 2 , 08 , 261 కోట్లు
  • మూలధన వ్యయం అంచనా - రూ. 47, 996 కోట్లు
  • రెవెన్యూ లోటు అంచనా - రూ. 17,036 కోట్లు
  • ద్రవ్యలోటు - రూ. 48, 724 కోట్లు
  • 3వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి బుగ్గన
  • రైతుభరోసా- పీఎం కిసాన్‌ యోజన రూ.3,900 కోట్లు
  • ఉచిత పంట బీమా- రూ.1802 కోట్లు
  • సున్నా వడ్డీ పంట రుణాలు- రూ.500 కోట్లు
  • రైతుభరోసా కేంద్రాలు- రూ.18 కోట్లు
  • వ్యవసాయ, మార్కెటింగ్‌- ధరల స్థిరీకరణ నిధి- రూ.500 కోట్లు
  • వ్యవసాయ పరీక్షా కేంద్రాలు- రూ.50 కోట్లు
  • ఉచిత, రాయితీపై విద్యుత్‌ సరఫరా రూ.5000 కోట్లు
  • పశుసంవర్థక, పాడి, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ.1,568 కోట్లు
  • ఆరోగ్య ఆసరాకు రూ.300 కోట్లు
  • వైద్య ఆరోగ్య- కుటుంబ సంక్షేమానికి 15,384 కోట్లు
  • ఆసరా రూ.6400 కోట్లు
  • హోంశాఖకు రూ. 7,586 కోట్లు
  • సున్నా వడ్డీ రూ.800 కోట్లు
  • చేయూత 4,235 కోట్లు
  • మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు రూ.4,322 కోట్లు
  • పింఛను కానుక రూ.18,000 కోట్లు
  • బీమా రూ.372 కోట్లు
  • వాహన మిత్ర రూ.260 కోట్లు
  • వైఎస్సార్‌ నేతన్న నేస్తం రూ.200కోట్లు
  • జగనన్న తోడు రూ.25 కోట్లు
  • జగన్న చేదోడు రూ.300 కోట్లు
  • వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం రూ.590
  • వైఎస్సార్‌ లా నేస్తం రూ.15 కోట్లు
  • వైఎస్సార్‌ కాపు నేస్తం రూ.500 కోట్లు
  • ఎస్సీ సబ్‌ ప్లాన్‌కు రూ.18,518 కోట్లు
  • ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,145 కోట్లు
  • బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.29,143 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి రూ.3,661 కోట్లు
  • కాపు సంక్షేమానికి రూ.3,537 కోట్లు
  • అమ్మ ఒడికి రూ.6,500 కోట్లు
  • మనబడి-నాడు, నేడు 3,500 కోట్లు
  • పాఠశాల విద్య రూ.27,706 కోట్లు
  • విద్యాదీవెనకు రూ.2,500 కోట్లు
  • వసతి దీవెనకు రూ.2,083 కోట్లు
  • ఉన్నత విద్య కోసం రూ.2,014 కోట్లు
  • పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి రూ.4,791కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ.15,846 కోట్లు
  • పురపాలక, పట్టణాభివృద్ధికి రూ.8,796 కోట్లు
  • నీటి వనరుల అభివృద్ధికి రూ.11,482 కోట్లు
  • పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.2,755కోట్లు
  • రవాణ, రోడ్లు, భవనాల శాఖకు రూ.8,581కోట్లు
  • ఇంధన శాఖకు రూ.10,281కోట్లు
  • నియోజకవర్గాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి రూ.350 కోట్లు

Tags

Read MoreRead Less
Next Story