AP: ప్రధానితో చంద్రబాబు కీలక చర్చలు

AP: ప్రధానితో చంద్రబాబు కీలక చర్చలు
X
అమరావతి నిర్మాణానికి ఇచ్చే నిధులపైనా చర్చ... కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ప్రధాని మోదీకి చంద్రబాబు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం మెుదట విడత నిధులు, రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా అందించే రూ.15కోట్లపైనా ఇరువురు చర్చించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అంశాలనూ ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఏపీ సీఎం సమావేశం అయ్యారు. ఢిల్లీలోని చంద్రబాబు అధికారిక నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రితో ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, వైజాగ్ రైల్వే జోన్‌పై కూలంకశంగా చర్చించారు.

చంద్రబాబు ట్వీట్

ప్రధాని మోదీతో చర్చలు ఫలవంతంగా జరిగాయని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పోలవరం సవరించిన వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ‘‘ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించా. రాష్ట్రం ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనే విషయాల్లో కేంద్ర మద్దతు ఉంది. అమరావతికి ప్రధాని మద్దతును అభినందిస్తున్నా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించా. రాష్ట్రం ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనే విషయాల్లో కేంద్ర మద్దతు ఉంది. అమరావతికి ప్రధాని మద్దతును అభినందిస్తున్నా’’ అని ఎక్స్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.

డిసెంబర్ నాటికి విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన

డిసెంబరు నాటికి విశాఖ కొత్త రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమైన సీఎం.. ఏపీలో లాజిస్టికల్, కమ్యూటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయాలని కోరారు. ఏపీ అంతటా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో రైల్వే శాఖ రూ.73,743 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. చంద్రబాబుకు చెప్పారు.

Tags

Next Story