Andhra Pradesh: ఏపీలో గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌..

Andhra Pradesh: ఏపీలో గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌..
Andhra Pradesh: ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. భారీ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లన్నారు.

Andhra Pradesh: ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. భారీ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లన్నారు. మాటలు, ప్రకటనల్లో YCP సర్కారు గొప్పలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయ్‌. తీరా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వచ్చేసరికి ఆ వేడి చల్లారిపోతుంది. ఈ మాట నిరుద్యోగులే అంటున్నారు. జగన్‌ నాడు విపక్షంలో చెప్పిందొకటి, నేడు చేస్తోంది ఒకటి అంటూ మండిపడుతున్నారు.

తాజాగా ఏపీలో గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రూప్‌-1 కేటగిరీలో 110, గ్రూప్‌-2 కేటగిరీలో 182 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ఘనంగా ప్రకటించింది. ఐతే.. గతంలో ఇంతకంటే భారీగానే రిక్రూట్‌మెంట్ జరిగింది అంటూ TDP వర్గాలు నాటి నోటిఫికేషన్లను చూపిస్తున్నాయి. 2016లోను, 2018లోను టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్స్‌ భర్తీ వివరాల్ని వెల్లడిస్తున్నాయి.

టీడీపీ టైమ్‌లో 2016లో 982 గ్రూప్‌-2 పోస్టులు, 78 గ్రూప్‌-1 పోస్టుల్ని భర్తీ చేశారు. ఇక 2018లో 446 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 160 గ్రూప్‌-1 ఉద్యోగాల్ని భర్తీ చేశారు. కానీ ఇప్పుడు YCP ప్రభుత్వం తక్కువ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తూ.. ప్రచారం మాత్రం హోరెత్తిస్తోందంటూ తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. నిరుద్యోగులు కూడా ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం రోడ్డెక్కి నిరసన తెలిపిన వాళ్లంతా.. ఇప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని మండిపడుతున్నారు. YCP వచ్చాక జాబ్‌ క్యాలెండర్ పేరుతో గ్రూప్‌-1, గ్రూప్‌-2కి కలిపి 36 పోస్టులే ప్రకటించారని ఇప్పుడు కూడా అరకొరగానే రిక్రూట్‌మెంట్‌ చేస్తూ యువతను మోసం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఐతే.. జాబ్ క్యాలెండర్‌లో పోస్టులకు అదనంగా వీటి భర్తీకి అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చుకుంటున్నాయి. గ్రూప్‌-1 కేటగిరీలో 110, గ్రూప్‌-2 కేటగిరీలో 182 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామంటున్నారు. డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, సీటీవోలు, డీఎస్పీ, డీఎఫ్‌ఓ, మున్సిపల్ కమిషనర్‌, ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ అధికారులు ఇలా వివిధ పోస్టుల భర్తీకి లైన్ క్లియరైందని వివరిస్తున్నారు.

నాడు విపక్షంలో ఉన్నప్పుడు 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్‌ పదే పదే ప్రకటనలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చేప్పటికే 1 లక్ష 42 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, 2019 కల్లా మరో 90 వేల మంది రిటైర్‌ అవుతున్నారు కాబట్టి మొత్తం 2 లక్షల 30 వేల వరకూ ఉద్యోగాల్ని భర్తీ చేయాలని, ఆ పని తాను చేస్తానని ప్రసంగాల్లో ఊదరగొట్టారు.

తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జాబ్‌ క్యాలెండర్‌లో అరకొర ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ముఖ్యంగా DSC లేదని, టీచర్ నియామకాలతోపాటు కానిస్టేబుల్స్‌ నియామకాల్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో TDP అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పాలనలో 9 వేలకుపైగా టీచర్లను తీసుకున్నారు.

పోలీసు శాఖలోనూ దాదాపు 7500 మందికి ఉద్యోగాలొచ్చాయి. వివిధ శాఖల్లోనూ రిక్రూట్‌మెంట్‌లు కొనసాగాయి. కళ్లముందే ఆ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన డేటా కనిపిస్తున్నా.. YCP నేతలు వాస్తవాల్ని పక్కకుపెట్టి సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటున్నారని TDP విమర్శిస్తోంది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లపాటు జాబ్ క్యాలెండర్‌ ఊసే ఎత్తని YCP సర్కార్‌.. గతేడాది జూన్‌లో జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అది సంఖ్య 10 వేలకే పరిమితమైంది.

దశల వారీగా వాటికి నోటిఫికేషన్లు వచ్చేలోపు కొత్త ఖాళీలు పెరుగుతూనే ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌ను వేగవంతం చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2ల్లో ఇప్పుడు ఆర్భాటంగా ప్రకటించినట్టు కాకుండా.. అన్ని ఖాళీ ఉద్యోగాలకు త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story