AP: దేశంలోనే ఏపీ నెంబర్ వన్

అనుభవం, విజన్ కలిసినప్పుడు అభివృద్ధి ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ మరోసారి నిరూపించింది. రాజకీయ ఉద్దండుడు, సీఎం చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ అనుభంతో.. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలోనే దేశ పారిశ్రామిక పటంలో అగ్రస్థానంలో నిలిపారు. పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపి ‘ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియా’గా తీర్చిదిద్దారు. సంక్షేమం అంటే కేవలం పథకాల పంపిణీ కాదు, సంపద సృష్టి అని నిరూపిస్తున్నారు. ప్రతి గడపకు ఫలాలు చేర్చాలన్న దృక్పథంతో.. నవ్యాంధ్ర ప్రదేశ్‌ను నిర్మిస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రరాష్ట్రాలను వెనక్కి నెట్టి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి (ఏప్రిల్-డిసెంబర్ 2025) గాను బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన తాజా ఆర్థిక నివేదిక ఈ అద్భుత ప్రగతిని వెల్లడించింది.
గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్ జోరు
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 25.3 శాతం వాటాను కైవసం చేసుకుంది.
* దేశవ్యాప్త మొత్తం పెట్టుబడులు: రూ. 26.6 లక్షల కోట్లు
* ఏపీ వాటా: సుమారు రూ. 6.72 లక్షల కోట్లు
* తర్వాతి స్థానాల్లో: ఒడిశా (13.1%), మహారాష్ట్ర (12.8%)కానుక అని కొనియాడారు.
'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మంత్రం
ఈ ఘనతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలకు లభించిన నూతన సంవత్సర కానుక అని కొనియాడారు. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' లక్ష్యంగా తీసుకువచ్చిన సంస్కరణలే ఈ విజయానికి పునాది అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించడానికి ప్రవేశపెట్టిన 'ఎస్క్రో ఆధారిత యంత్రాంగం' ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచిందని సీఎం స్పష్టం చేశారు.
గత తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన రంగాల వారీ కొత్త పాలసీలు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయి. మౌలిక సదుపాయాల కల్పన, సింగిల్ విండో క్లియరెన్స్ వంటి చర్యలు ఏపీని ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చాయి. ఫోర్బ్స్ బిజినెస్ మేగజైన్ సైతం ఏపీ వృద్ధి రేటును ప్రశంసిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం విశేషం. ఇదే ఊపు కొనసాగితే రానున్న కాలంలో రాష్ట్రం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే కేంద్రంగా మారుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

