AP New Cabinet : నేడు కొలువుదీరనున్న ఏపీ న్యూ క్యాబినెట్..!

AP New Cabinet : ఏపీ కొత్త కేబినెట్ ఇవాళ కొలువుదీరనుంది. ఎన్నో కసరత్తులు.. మరెన్నో సమీకరణాల మధ్య.. కేబినెట్‌ను ఫైనల్ చేశారు. మొత్తం 25 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు సీఎం జగన్. నూతన మంత్రివర్గం ఉదయం 11 గంటల 31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలో.. కొలువు తీనుంది. అనంతరం సీఎం జగన్, గవర్నర్‌తో కలిసి కొత్త మంత్రులు తేనేటి విందులో పాల్గొంటారు. మరోవైపు మంత్రుల పేర్లను ఖరారు చేసిన.. జాబితాను రాజ్‌భవన్‌కు పంపగా.. దానిని గవర్నర్ ఆమోదించారు.
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై మూడు, నాలుగు రోజుల నుంచి సీఎం కసరత్తు చేశారు. తుది జాబితాను గవర్నర్‌కు పంపేవరకూ లిస్ట్‌లో ఉన్నపేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పాటించారు. మొత్తం మీద పాత, కొత్త కలయికలో మంత్రివర్గం ఏర్పాటు కానుంది. అయితే ఈసారి పదకొండు మంది పాతవారిని కొనసాగించి... మిగిలిన స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించారు.
కొత్త మంత్రివర్గంలో సీనియర్లకు జగన్ పెద్దపీట వేశారు. తొలుత నలుగురు లేదా ఐదుగురు పాత మంత్రులకు అవకాశం కల్పిస్తారని భావించినా... సీనియర్ల నుంచి అసంతృప్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ సంఖ్యను 11కు పెంచారు. తొలి మంత్రివర్గంలో ఉన్న సిదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ , చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ , పినిపే విశ్వరూప్, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె నారాయణస్వామి, అంజాద్ బాషాలకు రెండోసారి కూడా మంత్రి పదవులు దక్కాయి.
ఇక కేబినెట్‌లో 14 మంది కొత్తవారికి స్థానం కల్పించారు. ధర్మాన ప్రసాదరావు, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, విడదల రజని, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఆర్‌కె రోజా, ఉషశ్రీ చరణ్‌కు మంత్రి పదవులు దక్కాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరికి చొప్పున అవకాశం దక్కింది. అయితే గుంటూరు, ఎన్టీఆర్, అన్నమయ్య, విశాఖ, అల్లూరి, తిరుపతి, రాజంపేట, సత్యసాయి జిల్లాల నేతలకు మంత్రిపదవి దక్కలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com