AP Cabinet : కొలువుదీరిన జగన్ కొత్త క్యాబినెట్..!

AP Cabinet : జగన్ కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది పాత మంత్రులతో పాటు కొత్తగా అవకాశం దక్కిన 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, అమర్‌నాథ్, నారాయణస్వామి, ఉషశ్రీ చరణ్, సీదిరి అప్పలరాజు, విడదల రజనీ మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత జగన్ పట్ల స్వామి భక్తి ప్రదర్శించారు. సభా వేదికగా మోకాళ్లపై కూర్చుని జగన్ కాళ్లు మొక్కారు. ముహూర్తం ప్రకారం సరిగ్గా 11 గంటల 31 నిమిషాలకు కార్యక్రమం మొదలైంది. ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో ఒక్కొక్కరుగా ప్రమాణం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ 25 మందితో ప్రమాణస్వీకారం చేయించారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com