AP News: ఏపీలో రేషన్ పంపిణీ చేసేదే లేదంటున్న డీలర్లు..

AP ration dealers (tv5news.in)
AP News: ఏపీలో ఇవాల్టి నుంచి రేషన్ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఐసీడీఎస్‌కు మళ్ళించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు డీలర్లు కోరారు. 2020 మార్చి 29 నుంచి ఇప్పటివరకు ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యలు పరిష్కరించే వరకు రేషన్ పంపిణీ చేసేది లేదని రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. గోనె సంచులను ప్రభుత్వానికి తిరిగిస్తే 20 చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు చెల్లింపు చేయమని చెప్పడం సరైంది కాదని డీలర్లు ఆక్షేపించారు. గోనె సంచులు తిరిగి ఇవ్వకుంటే ఎలాట్‌మెంట్ కట్ చేసి కేసులు పెడతామని హెచ్చరించడం తగదన్నారు.
గోనె సంచులు ప్రభుత్వం తీసుకునేలా ఇచ్చిన జీవో 10ని పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు చేస్తున్నారని డీలర్లు గుర్తుచేశారు. ఏపీలోనూ జీవో 10ని యథాతథంగా అమలు చేయాలని రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ విధానంలో బయెమెట్రిక్ సరికొత్త విధానం తీసుకొచ్చిన ఏపీ సర్కార్‌కు రేషన్ డీలర్లు కొలుకోలేని దెబ్బకొట్టారు. ఎట్టి పరిస్థితుల్లో పీఎంజీకేవై కమిషన్ బకాయిలు తక్షణమే చెల్లించే వరకు రేషన్ పంపిణీ చేసేది లేదని తెగేసి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com