Chandranna Kanuka : ఏపీలో మళ్లీ చంద్రన్న కానుకలు?
ఏపీలో రేషన్ కార్డుదారులకు తిరిగి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలను లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇస్తారు. ఇందుకు ఏటా రూ.538 కోట్లు ఖర్చు కానుంది. ఐదేళ్లకుగానూ ప్రభుత్వంపై రూ.2,690 కోట్ల అదనపు భారం పడనుంది. చంద్రన్న సంక్రాంతి కానుక కింద గోధుమపిండి, శనగపప్పు, బెల్లం, కందిపప్పు, పామాయిల్, నెయ్యి అందజేస్తారు.
పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులపై వైసీపీ రంగులు, YSR, YS జగన్ ఫొటోలు ముద్రించి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రేషన్ కార్డుల రంగులు మారనున్నాయి. వీటికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
పెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ‘2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2500 కోట్లు రావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం రూ.160 కోట్లు ఇచ్చింది. ఆస్పత్రుల రోజువారీ ఖర్చులకూ డబ్బులు లేవు. అందుకే సేవలు కొనసాగించలేం’ అని ప్రభుత్వానికి లేఖ రాసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com