YCP government : వైసీపీ సర్కారు తీరుపై ఏపీ ఉద్యోగసంఘాల ఆగ్రహం

ఉద్యోగులంతా కలిసి వైసీపీ సర్కారు దురాగతాలను ఎదుర్కోవాలన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ. ప్రభుత్వ ఉద్యోగులంటే జగన్ సర్కారుకు లెక్కలేకుండా పోయిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని సీఎం జగన్ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లవుతున్నా CPS రద్దు, DA చెల్లింపు, PRC అమలుపై నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. తమను కించపరిచేలా మాట్లాడిన మంత్రి బుగ్గన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఉద్యోగుల సొమ్మునే స్వాహా చేసిన చంద్రశేఖర్ రెడ్డికి ఉద్యోగుల సలహా దారునిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు అమ్ముకున్న కేసులో చంద్రశేఖర్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కేసు బుక్ చేసిందన్నారు. కేసు పెట్టిన ప్రభుత్వమే .. ఉద్యోగుల సలహాదారునిగా ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. జీతం నుంచి దాచుకునే GPF ను కూడా...... ప్రభుత్వం తన అవసరాలకు వాడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల లీడర్లు. తమ ప్రమేయం లేకుండానే తమ ఖాతాల్లో సొమ్ము ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై CMSF, ఆర్థికశాఖ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com