Krishna District: దీనస్థితిలో మహిళ మృతి.. పట్టించుకోని భర్త.. అంగన్వాడీ కార్యకర్తల మానవత్వం..

Krishna District: అయినవాళ్లు వదిలేశారు. నూరేళ్లూ తోడుగా ఉంటానంటూ తాళికట్టిన భర్త.. ముఖం చాటేశాడు. కడసారి కన్నవాళ్లు పట్టించుకోని దీన స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. కనీసం అంత్యక్రియలు కూడా చేయలేని కర్కశంగా ఆమెను వదిలేయడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ముందుకొచ్చారు. సాటి మహిళ చనిపోతే చూడలేక చలించిపోయారు. స్మశానవాటికకు పాడిపోస్తూ.. ఆమెకు దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు. ఈఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది.
అనారోగ్యంతో చనిపోయిన ఓ మహిళను.. ఆమె కుటుంబ సభ్యులు దిక్కులేని అనాధశవంలా వదిలేశారు. రాత్రంతా స్మశానంలోనే అమె మృతదేహం ఉండిపోవడంతో విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు.. ఆమెకు దగ్గరుండి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహిళలైన అంగన్వాడీ కార్యకర్తలు చేసిన పనిని ప్రతి ఒక్కరూ ప్రసంసిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com