Anna Canteens Menu Revealed : అన్న క్యాంటీన్ మెనూ ఇదే
ఆకలితో అలమటించే పేదలకు రూ.15 రూపాయలకే మూడు పూటలా ఆహారం అందించే బృహత్తరమైన కార్యక్రమం ‘అన్న క్యాంటీన్’ పథకమని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ లభించనుంది. ఆదివారం క్యాంటీన్‌కు సెలవు ఉంటుంది.
అన్న క్యాంటీన్ మెనూ
సోమవారం - బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ ,చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
మంగళవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా,చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్ ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
బుధవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
గురువారం- బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
శుక్రవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా,చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
శనివారం- బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్ ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
దివంగత ఎన్టీఆర్ అడుగుజాడల్లో తమ ప్రభుత్వం పయనిస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘మాది పేదల ప్రభుత్వం. ఆర్థిక కష్టాలున్నప్పటికీ సామాజిక పింఛన్లు పెంచి అందిస్తున్నాం. పేదల ఆకలి తీర్చేందుకు నేటి నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి ప్రజలు భాగస్వాములు కావాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాల రోజున విరాళాలు ఇస్తే మీ పేరున భోజనం పెడతాం’ అని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com