Chandrababu Naidu : ఏపీకి మరో బాహుబలి ప్రాజెక్ట్.. చంద్రబాబు మార్క్

Chandrababu Naidu : ఏపీకి మరో బాహుబలి ప్రాజెక్ట్.. చంద్రబాబు మార్క్
X

ఏపీకి కూటమి హయాంలో వరుసగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీలు మాత్రమే కాదు జాతీయస్థాయి గవర్నమెంటు కంపెనీలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి భారీగా సాయం అందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన టిడిపి, జనసేన పార్టీలకు ఇప్పుడు సానుకూలంగా ఉంటుంది కేంద్రం. అందుకే ఏపీ అభివృద్ధిలో కేంద్రం సాయాన్ని వీలైనంత ఎక్కువగా వాడుకుంటుంది చంద్రబాబు ప్రభుత్వం. ఇందులో భాగంగానే అమరావతి డెవలప్మెంట్ కోసం కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకుంది. దానికి తోడు జాతీయ స్థాయి కంపెనీలను కూడా ఏపీకి రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఏపీకి మరో బాహుబలి ప్రాజెక్టు రాబోతోంది. భారత డైనమిక్ లిమిటెడ్ ఆయుధాల కంపెనీ ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెడుతోంది.

దొనకొండ వద్ద ఏకంగా 1200 కోట్ల రూపాయలతో భారీగా కంపెనీని ఏర్పాటు చేస్తోంది. ఇందుకు కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు చకచకా జరగబోతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గత మే 23న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఈ ప్రాజెక్టుపై ప్రతిపాదనలు అందించారు. ఈ ప్రాజెక్టును ఏపీలో పెట్టేందుకు కావలసిన సదుపాయాలను, ప్రభుత్వ విధానాలను, ఏపీ భౌగోళిక పరిస్థితులను వివరించి ఒప్పించారు. ఒకటికి రెండుసార్లు ఫోన్లో కూడా మాట్లాడారు. ఇలా చంద్రబాబు నాయుడు అంత ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టే రాజ్నాథ్ సింగ్ ఏపీలో ఈ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నారు. ఈ ఆయుధాల కంపెనీ దేశంలోనే మూడో అతిపెద్దది ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేస్తుంది. అంతకుముందు ఉత్తర ప్రదేశ్, తమిళనాడులోని ఈ కంపెనీ సంస్థలు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు కోసం 1500 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. మొదటి దశలో 650 కోట్లు రెండవ దశలో 550 కోట్లను పెట్టుబడులు పెడుతుంది ఈ కంపెనీ. ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీలో ప్రొపెల్లెంట్ మోటార్లు, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కంపెనీ ద్వారా మొత్తం 1600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. 2026 ఏప్రిల్ లో దీనికి నిర్మాణ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ కంపెనీ ద్వారా దేశవ్యాప్తంగా ఆయుధాలు ఎక్స్ పోర్ట్ చేయడంతో ఇంటర్నేషనల్ గుర్తింపు ఏపీకి రాబోతోంది. రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని చిత్తశుద్ధి ఉన్న నాయకుడే ఏపీకి సీఎంగా ఉన్నారు కాబట్టి ఇన్ని రకాల కంపెనీలు వస్తున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని.. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలను ఏపీకి తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు.

Tags

Next Story