Ram Gopal Varma : తుళ్లూరు పీఎస్ లో వర్మపై మరో కేసు నమోదు

వివాదాస్పద సినీ దర్శకుడు, రాజకీయ విమర్శకుడు రాంగోపాల్ వర్మపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టారని..టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వర్మపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పెదపరిమి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్ వర్మపై సోమవారం కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ పోస్టు చేశారంటూ.. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో టీడీపీపై విమర్శలు చేసిన వారిపై కేసులు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే శ్రీరెడ్డి లాంటివాళ్లు బహిరంగ క్షమాపణలు చెప్పారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com