AP: జైల్లో పెడతరాట : కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

జైల్లో పెడతామని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు లీకులిస్తున్నారని అన్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. వైసీపీలో కొనసాగడం ఇష్టం లేక మౌనంగా వెళిపోదామని అనుకుంటే మంత్రులు,రీజనల్ కో-ఆర్డినేటర్లు,సలహాదారులు నాపై మాట్లాడుతుంటే సమాధానం ఇస్తున్నానని అన్నారు. అన్ని పాములు లేచాయని ఏలిక పాము మా బావ కాకాణి కూడా లేచాడని సెటైర్ వేశాడు. తనది నమ్మకద్రోహం అయితే జడ్పీ ఛైర్మన్ చేసిన ఆనం రాంనారాయణ రెడ్డి కి కాకాణి చేసింది ఏంటని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ మహా సముద్రమని, అందులో జగన్ ఒక నీటి చుక్క అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. నేనే వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు కాళ్లకు దండం పెట్టలేదని, చంద్రబాబును కలసి కాళ్లు మొక్కింది కాకాణేనని అన్నారు కోటం రెడ్డి.
మరోవైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై మండి పడ్డారు కోటంరెడ్డి. తనకు ఇటీవల ఫోన్‌కాల్స్ ఎక్కువైయ్యాయని అందులో 70 శాతం మంది అభినందిస్తుంటే 30 శాతం మంది విమర్శిస్తున్నారని అన్నారు. తనకు బోరుగడ్డ అనీల్ పేరుతో ఉన్న నంబర్ నుండి కాల్ వచ్చిందని, తనను తన తమ్ముడిని కొట్టుకుంటూ తీసుకెళ్లుతామని బెదిరించారని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, ఇలాంటి ఫోన్‌లు వస్తే సజ్జలకు వీడియో కాల్స్ వస్తాయని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com