AP: ఉమ్మడి తూర్పుగోదావరి పసుపు మయం

టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా మొత్తం పసుపుమయంగా మారిపోయింది. రహదారులన్నీ చంద్రబాబు ఫ్లెక్సీలు చంద్రబాబు జెండాలే దర్శనమిస్తున్నాయి. ఇక రోడ్ షోలు జనసునామీని తలపిస్తున్నాయి. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.
అయితే జిల్లాలో చంద్రబాబు పర్యటన మూడో రోజుకు చేరింది. ఇవాళ పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సామర్లకోటలో పెద్దాపురం నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. మరోవైపు మహాసేన రాజేష్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరనున్నారు. ఇక ఇవాళ బొడ్డు భాస్కర రామారావు విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పిస్తారు. అనంతరం అనపర్తి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. ఇక రామవరంలో నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం దేవి చౌక్ సెంటర్‌లో చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com