AP : పల్నాడులో ఉద్రిక్తత, టీడీపీ నేత బాలకోటి రెడ్డి మృతి

AP : పల్నాడులో ఉద్రిక్తత, టీడీపీ నేత బాలకోటి రెడ్డి మృతి
X
తుపాకీ కాల్పుల్లో మృతి చెందిన టీడీపీ నేత బాలకోటిరెడ్డి మృతదేహానికి కాసేపట్లో స్వగ్రామం అలవాలకు తరలించనున్నారు

పల్నాడు జిల్లా అలవాలలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత బాలకోటి రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. తుపాకీ కాల్పుల్లో మృతి చెందిన టీడీపీ నేత బాలకోటిరెడ్డి మృతదేహానికి కాసేపట్లో స్వగ్రామం అలవాలకు తరలించనున్నారు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 20రోజులుగా మృత్యువుతో పోరాడిన బాలకోటిరెడ్డి చనిపోయారు. అయితే వైసీపీ నేతలే కాల్పులు జరిపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

పల్నాడు జిల్లా టీడీపీ రొంపిచర్ల మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి గుంటరులోని ఆస్పత్రిలో 20రోజులు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయాడు. ఈ నెల 1న స్వగ్రామమైన అలవాలలో ఇంట్లో ఉండగా బాలకోటిరెడ్డిపై అదే గ్రామానికి చెందిన కొందరు ప్రత్యర్థులు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో 17న గుంటూరులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి ప్రాణాలు విడిచిపెట్టారు.

ఇది ప్రభుత్వ హత్యేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 'తొలిసారి దాడి చేసినప్పుడు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదంటున్నారు. బాలకోటిరెడ్డికి ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేసినా రక్షణ కల్పించలేదని ఆరోపిస్తున్నారు.

Tags

Next Story