AP : చంద్రబాబు పర్యటనలో పోలీసుల వైఫల్యం

X
By - Vijayanand |24 Feb 2023 12:24 PM IST
వాహనంలో వెళ్లేందుకు వీలు లేకపోవడంతో కాలినడకన బయల్దేరారు. నడుచుకుంటూనే చిన్నా ఇంటి నుంచి టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరం పర్యటనలో పోలీసుల వైఫల్యం కన్పించింది. ట్రాఫిక్ నిలిపివేతతో చంద్రబాబు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. దొంతు చిన్నా కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన చంద్రబాబు. అక్కడి నుంచి వాహనంలో వెళ్లేందుకు వీలు లేకపోవడంతో కాలినడకన బయల్దేరారు. నడుచుకుంటూనే చిన్నా ఇంటి నుంచి టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు చంద్రబాబు.
అంతకు ముందు గన్నవరంలో టీడీపీ నేత దొంతు చిన్నా కుటుంబాన్ని పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన ఇంటికి వెళ్లి ... కుటుంబసభ్యులను పరామర్శించారు. వైసీపీ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.... దొంతు చిన్నాకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com