AP : జగన్ వెనక్కి తగ్గారంటున్న పార్టీ శ్రేణులు, ఏపీ ప్రజలు..!

AP : జగన్ వెనక్కి తగ్గారంటున్న పార్టీ శ్రేణులు, ఏపీ ప్రజలు..!

ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తగ్గారనే ప్రచారం జోరందుకుంది. వైసీపీ వర్క్‌ షాపులతో హంగామా చేసే ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్‌లు ఇచ్చే వైసీపీ అధినేతలో ఏదో కలవరం మొదలయినట్లు కన్పిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే అన్ని మారిపోయాయి. అధినేత వెనకడుగులు వేస్తున్నట్లు క్యాడర్‌లో జోరుగా చర్చ జరుగుతుంది. ఓటమి ఖాయమన్నట్లుగా జగన్‌ వైఖరి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్‌లో నైరాశ్యం మొదలు కావడానికి ప్రధాన కారణం పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే కారణం. మూడు స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలువలేకపోయారు. చివరికి తన సొంత ఇలాక పులివెందులలోనూ పరాభావం తప్పలేదు. ఇదేం పెద్ద ఓటమి కాదని వైసీపీ నేతలు బయటకు గంభీరంగా చెప్పుకుంటు న్నా.. జగన్ మాత్రం నిస్తేజంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 60 మందికి సీట్లుండవని విష ప్రచారం చేస్తున్నారని జగ న్ మండిపడ్డారు. ఇక ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లలో ఆత్మ స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరాజయాన్ని తక్కువ చేసి చూపేందుకు తంటాలు పడ్డారు.

ఇదిలా ఉంటే గడప గడపకు మన ప్రభుత్వం వర్క్‌ షాప్‌కు పలువురు నేతలు డుమ్మా కొట్టారు. ఇందులో మంత్రులు సైతం ఉ న్నారు. అయితే ఈ సమావేశానికి ఖచ్చితంగా హాజరుకావాలని ఆదేశాలు ఉన్నప్పటికీ.. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు రాక పోవడంపై జోరుగా చర్చ జరుగుతుంది. మంత్రులు ధర్మాన, బుగ్గన, ఎమ్మెల్యే కొడాలి, వల్లభనేని వంశీతోపాటు పలువురు హాజ రుకాలేదని తెలుస్తోంది. ఇక ప్రభుత్వ సలహాదారుడు సజ్జల సైతం స మావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. స్పష్టమైన ఆ దేశాలు ఉన్నప్పటికీ హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాశం అయ్యింది. ఇక గత వర్క్ షాప్‌లో 38మంది ఎమ్మెల్యేలు, ఐ దుగురు మంత్రుల పనితీరు బాగలేదన్న జగన్.. ఇప్పుడు వారి పనితీరుపై వర్క్ షాప్‌లో ప్రస్తావించలేదు. కొత్తగా ఎవరెవరి పని తీరు ఎలా ఉందని కూడా చర్చించలేదు. ఎమ్మెల్యేల పనితీరు గుర్తు చేసేందుకే వర్క్‌ షాప్‌ పెట్టేవారు జగన్. అలాంటిది ఎలాం టి మందలింపు లు లేవు. మందలిస్తే తిరగబడతారని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్‌కు స్పష్టంగా అర్థం అయినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story