AP Cabinet : కొత్త పీఆర్సీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం...!

AP Cabinet : కొత్త పీఆర్సీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం...!
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ కెబినెట్ భేటీ ముగిసింది. ఈ సందర్బంగా మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

AP Cabinet : ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నా.. పీఆర్సీపై ముందుకే వెళ్లింది జగన్‌ ప్రభుత్వం. ప్రద్యోగుల డిమాండ్లు, సమ్మె హెచ్చరికలను లెక్కచేయని ఏపీ ప్రభుత్వం.. పీఆర్సీ జీవోలకు.. కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపింది. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని తీర్మానించింది. ఈ నిర్ణయంతో పీఆర్సీపై పునరాలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే కొత్త పీఆర్సీపై ఉద్యోగులకు నచ్చజెప్పడానికి కేబినెట్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన, పేర్ని నానిలతో పాటు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ ఉంటారు. ఈ కమిటీ ఉద్యోగులో సమావేశమై.. పీఆర్సీపై నచ్చజెప్పే ప్రయత్నం చేయనుంది.

మరోవైపు అగ్రవర్ణ పేదల కోసం ఈబీసీ నేస్తంను ప్రవేశపెడుతోంది జగన్‌ సర్కార్‌. దీనికి 589కోట్ల రూపాయల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు భూమి కేటాయింపుతో పాటు ఉద్యోగుల హౌసింగ్‌ స్కీమ్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాష్ట్రంలో కొత్తగా 16వైద్య కళాశాలకు నిర్మించాలని తీర్మానించిన కేబినెట్‌.. దీని కోసం 7,880 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది.

అటుగ్రామీణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న ఓటీఎస్‌ పైనా ఏపీ ప్రభుత్వం ముందుకే వెళుతోంది. ఓటీఎస్‌ చెల్లింపులకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62ఏళ్లకు పెంచుతూ గతంలో ఇచ్చిన ఆదేశాలకు ఆమోదముద్ర వేసింది.

Tags

Read MoreRead Less
Next Story