AP New Cabinet: ఏపీ కేబినెట్ లో కొత్త మంత్రులు ఎవరన్నదానిపై ఊహాగానాలు..

AP New Cabinet: ఏపీ కేబినెట్ లో కొత్త మంత్రులు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేబినెట్‌లో కొనసాగే ఆ ఐదారుగురు ఎవరు అన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్త జిల్లాల ప్రాతిపదికన మంత్రిపదవులిస్తారా..? లేక ఈ సారి సామాజికవర్గాల వారిగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా..? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెల 11 వ తేదీన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఎవరెవరికి అమాత్య పదవులు వస్తాయోనన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.
మరోవైపు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రాంతీయ మండళ్లు కీలకం కానున్నాయి. తొలగించిన మంత్రులకు ప్రాంతీయ మండళ్ల బాధ్యతలు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆగస్టు కల్లా ప్రాంతీయ మండళ్లు పూర్తి చేసే ఛాన్సుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. కొందరికి ప్రాంతీయ మండళ్లు అప్పగిస్తే.. మరికొందరికి జిల్లా అధ్యక్షుల బాధ్యతలు అప్పగించనున్నారు.
తద్వారా తొలగించిన మంత్రులకు ప్రోటాకాల్ సమస్య తీరుతుందని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు.. అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులను జగన్ ఓదార్చారు. రాజీనామా చేసిన మంత్రులు పార్టీ పటిష్టతకు కృషి చేస్తే.. కొత్త మంత్రులు అధికారంలో ఉండి మళ్లీ ప్రభుత్వం రావడానికి పని చేస్తారని సీఎం చెప్పారని సమాచారం. తద్వారా కలిసికట్టుగా పని చేసేలా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com