AP: ఆటోలో ప్రయాణించిన చంద్రబాబు, లోకేశ్

ఆటోడ్రైవర్ల సేవలో పథకాన్ని సీఎం నారా చంద్రబాబు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నుంచి సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య గ్రౌండ్స్ వరకు ఆటోలో ప్రయాణించారు. సొంతంగా ఆటో, క్యాబ్, ట్యాక్సీ కలిగి ఉన్న డ్రైవర్లకు ప్రభుత్వం రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.ఉండవల్లి నుంచి ఆటోలో సింగ్‌నగర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బయల్దేరారు. అంతకుముందు చంద్రబాబు, పవన్, మాధవ్‌కు మంగళగిరి చేనేత కండువాలను కప్పి లోకేశ్ స్వాగతం పలికారు. కూటమి నేతలకు మద్దతుగా పెద్ద ఎత్తున మంగళగిరి ప్రజలు తరలివచ్చారు.
మేనిఫెస్టోలో లేకపోయినా..
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు అనే కార్యక్రమం కూటమి మేనిఫెస్టోలో లేదు. అయితే స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అమలతో ఆటో డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే రూ.1,000 కోట్లు ఖర్చు చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టంది. పాతవాహనాలపై గత ప్రభుత్వం భారీగా గ్రీన్ ట్యాక్స్ వేయగా.. కూటమి ప్రభుత్వం రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను రూ.3 వేలకు తగ్గించింది. దీంతో ఆటోలు, క్యాబ్ డ్రైవర్లకు ఉపశమనం లభించింది.
ఏపీలోని ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా రూ.15వేలు చొప్పున అందజేయనున్నారు. సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ఆటో డ్రైవర్ సేవలో పథకం రూపొందించింది. ఈ పథకం కింద మొత్తం 3,10,385 మంది అర్హుల జాబితా సిద్ధం చేశారు. క్షేత్ర స్థాయి పరిశీలన తరువాత అర్హుల జాబితా ఖరారు చేశారు. ఏపీ ప్రభుత్వంపై రూ.466 కోట్ల భారం పడనుంది. స్త్రీ శక్తి పథకం వల్ల జీవనోపాధి ఇబ్బంది ఎదురైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆటో డ్రైవర్ల కోసం ప్రారంభించబోతున్న పథకం జాబితాలో పేరు ఉందో లేదో స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ పథకం స్టేటస్ చెక్ చేయడానికి లాగిన్ అవసరం లేదు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆధార్ కార్డ్ నంబర్‌తో చెక్ చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కేవలం ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం గత పాలకులకంటే 50 శాతం అదనంగా రూ.15 వేలు ఇస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com