CBN: జగన్‌కు ఎంత ధైర్యం..ఇక నేనేంటో చూపిస్తా: చంద్రబాబు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా సుపరిపాలనలో తొలి అడుగు వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ పథకం ఇస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ హామీని నెరవేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒక కీలకమైన పథకమని పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇందుకోసం రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ నిధుల్లో రూ.1,346 కోట్లను పాఠశాలల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని అమ్మఒడి పథకంతో పోల్చినప్పుడు, తమ ప్రభుత్వం అందిస్తున్న ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఎక్కువ మందికు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు.
చంద్రబాబుపై ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ధైర్యం ఉంటే తెనాలిలో గంజాయి బ్యాచ్‌ను పరామర్శిస్తారని సూటిగా ప్రశ్నించారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... వైసీపీ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘పొదిలిలో బాధ్యత లేకుండా పర్యటిస్తారా? దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అంటారా? రౌడీలను వెంటేసుకొని వెళ్లి రౌడీయిజం చేస్తారా? జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నాం. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదు. ఇప్పటివరకూ నా మంచితనాన్ని చూశారు.. ఇకపై ఉపేక్షించను. హద్దుమీరితే ఇకపై ఊరుకునేది లేదు. 11 సీట్లకే జనం పరిమితం చేసినా వాళ్లకు బుద్ధి రాలేదు. వైసీపీ తీరును సరైన సమయంలో మరోసారి ఆధారాలతో ఎండగడతా. అమరావతిపై వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకే పొదిలిలో దాడులు చేశారు’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. లోకేష్‌కు.. తల్లికి వందనం జీవోలను చంద్రబాబు అందజేశారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై లోకేష్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకున్నామని, పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే వారికి కూడా నిధులు జమచేస్తామని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com