CBN: వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ

విజయవాడ వరద బాధితుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. వరద కారణంగా నష్టపోయిన వారికి ఒక్కో ఇంటికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. నష్టపోయిన పరిశ్రమలకు కూడా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. వారి టర్నోవర్ ను బట్టి సాయం చేయాలని యోచిస్తున్నారు. వంద రోజుల పాలనలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు కీలక ప్రకటన
విజయవాడ వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామని బాబు తెలిపారు. ప్రతి ఇంటికి రూ.25వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని... మొదటి అంతస్తులో ఉండే వారికి రూ.10వేలు, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10వేలు, చిరు వ్యాపారులకు రూ.25వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. టూవీలర్స్‌కు రూ.3వేలు, మూడు చక్రాల వాహనాలకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఫిషింగ్ బోట్, నెట్ పాక్షికంగా డ్యామేజీ అయితే రూ.9వేలు, పూర్తిగా డ్యామేజీ అయితే రూ.20వేలు ఇస్తాం. సెరీ కల్చర్‌కు రూ.6వేలు. పశువులకు రూ.50వేలు. వరి ఎకరాకు రూ.10వేలు, చెరకు రూ.25వేలు చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
చేనేత కార్మికులకు ఆర్థిక సాయం
చేనేత కార్మికులకు రూ.15వేలు. నష్టపోయిన ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. రూ.40లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.లక్ష, రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వాటికి రూ.1.5లక్షలు ఇస్తాం. ఒక్కో కోడికి రూ.100, షెడ్డు ధ్వంసమైతే రూ.5వేలు. పశువులకు రూ.50వేలు, ఎద్దులకు రూ.40వేలు. దూడలకు రూ.25వేలు, గొర్రెలకు రూ.7500. ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తవి అందజేస్తామన్నారు. హెక్టారు పత్తికి రూ.25వేలు, వేరుశనగకు , హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు రూ.15వేలు, పసుపు, అరటికి రూ.35వేల చొప్పున సాయం. మొక్క జొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు రూ.15వేలు చొప్పున ఇస్తాం. బైక్‌ల బీమా, మరమ్మతులకు సంబంధించి 9వేలకు పైగా క్లెయిమ్‌లు పరిష్కరించాం. ద్విచక్రవాహనదారులు రూ.71 కోట్ల మేర క్లెయిమ్‌లు చేశారని... రూ.6కోట్లు చెల్లించాం.. 6వేల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com