CBN: మానవతావాది ఎన్టీఆర్: చంద్రబాబు

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళ్లు అర్పించారు. 'సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు, బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది, అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశమని నిరూపించిన శక్తి‘ అన్నారు.
ఎన్టీఆర్ ఒక ప్రభంజనం: లోకేశ్
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు మంత్రి లోకేశ్ ఘన నివాళులర్పించారు. ‘ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రభంజనం, అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై టీడీపీ నిర్మితమైంది. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లని నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతగారే నాకు నిత్యస్ఫూర్తి.’ అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ కు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నామని నారా లోకేశ్ అన్నారు. తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తామన్నారు.. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదగాలని లోకేశ్ ఆకాంక్షించారు.
మరణం లేని జన్మ ఎన్టీఆర్ ది: పురంధేశ్వరి
ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా ఆమె కుమార్తె, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆయనకు అంజలి ఘటించారు. ఎన్టీఆర్ సినీ రంగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్న ఆమె.. ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్టీఆర్ కుమార్తెగానే పుట్టాలని కోరుకుంటానని తెలిపారు. ఎన్టీఆర్ ది మరణం లేని జన్మన్న పురంధేశ్వరి.. తెలుగు రాజకీయ చరిత్రపై ఆయనది చెరిపేయలేని సంతకమని కొనియాడారు.
రూపాయి జీతం ట్రెండ్ ఎన్టీఆర్‌దే
నీతి, నిజాయితీకి నిలువెత్తు రూపమైన ఎన్టీఆర్.. సీఎంగా కేవలం రూపాయి జీతం తీసుకోవడమనే ట్రెండ్ స్టార్ట్ చేసింది ఆయనే. కేవలం ఒక్క రూపాయి వేతనం మాత్రమే తీసుకునే సీఎంగా చరిత్ర సృష్టించారు. పెట్రోలు ధరలు పెరిగిపోవడంతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని, ఆటోపై సెక్రటేరియట్‌కు వచ్చి సింప్లిసిటీ చాటుకున్నారు. అవినీతికి పాల్పడుతున్నారనే ఉద్దేశంతో తన కేబినెట్ సహచరుడిని ఏసీబీకి పట్టించి నిజాయితీని చాటుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com