CBN: రైతు బిడ్డ చంద్రన్న

CBN: రైతు బిడ్డ చంద్రన్న
X
ట్రాక్టర్ నడిపిన చంద్రబాబు.. సామాన్యులతో మమేకమైన సీఎం

P4 కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని వడ్లమానులో పర్యటించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వృత్తిదారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. స్టాల్స్ నిర్వాకులతో మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడున్న టాక్టర్‌ను ఎక్కి నడిపారు. అలాగే కుండలు చేసే చక్రాన్ని తిప్పారు.

సీఎం అయినా సామాన్యుడే

40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు పర్యాయాలు సీఎం అయినా సామాన్యుడిలా ప్రజలతో మమేకం ఆయనే రాజకీయ చాణక్యుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజానాయకుడు ప్రజల్లోనే ఉంటాడని ఆయన వడ్లమాను గ్రామం వేదికగా మరోసారి నిరూపించారు. ‘సీఎం హోదాలో ఉన్నా సాధారణ పౌరుడిలా కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలతో మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా అక్కడ ప్రజలతో చంద్రబాబు మమేకం అవుతున్నారు. పేదరికం నిర్మూలనే లక్ష్యంగా పీ4 పథకాన్ని తీసుకొచ్చారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించారు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు’ అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబుపై నెటిజన్ల ప్రశంసల జల్లు

చంద్రబాబు టాక్టర్ నడిపిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘రైతు బిడ్డ చంద్రన్న, దేశానికి వెన్నుముక రైతన్న.. ఆ అన్నదాతకు అండ చంద్రన్న’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Next Story