AP: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు (శనివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేయనున్నారు. బీజేపీకి మద్దతుగా తెలుగువారున్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి నేడు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్‌తో TDP ఎంపీలు సమావేశం కానున్నారు. ఆదివారం ఎంపీలతో కలిసి BJP తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఆదివారం రోజు ఎంపీలతో కలిసి బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. బీజేపీ స్థానిక నేతలు ఇప్పటికే చంద్రబాబు షెడ్యూల్ ఖరారు చేశారు. ఏపీ - తెలంగాణ కు చెందిన దాదాపు ఆరు లక్షల మంది ఓటర్లు ఢిల్లీ పరిధిలో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీకి ఈ సారి ప్రతీ నియోజకవర్గంలో గెలుపు కీలకంగా మారుతోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా సీఎం చంద్రబాబు ఢిల్లీ ప్రచారంలో బీజేపీ గెలుపు అవసరాన్ని వివరిస్తూ.. మోదీ నాయకత్వానికి మద్దతు గా ఓట్లు వేయాలని కోరనున్నారు.
కీలక అంశాలపై చంద్రబాబు చర్చ
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. కోటి సభ్యత్వాల నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై పార్టీ నేతలతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలను మహానాడులోపు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ నేతలు తెలిపారు. పార్టీ పదవులకు మూడేళ్ల నిబంధనపైనా చర్చ జరిపారు.
గెలుపుతోనే సుస్థిర పాలన
ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ఎన్డీయే పక్షాలు సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసుకుని పని చేయాలన్నారు. తొలిసారి గెలిచిన, కొత్తగా వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని మనం చెప్పట్లేదని చంద్రబాబు అన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామని.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న పెట్టుబడులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com