CBN: సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు కుటుంబం

ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత గ్రామం నారావారిపల్లెలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో కుటుంబంలో కలిసి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మిణి, దేవాన్ష్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సందడిగా గడిపారు. భోగి వేడుకల్లో సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. మహిళలు వేసిన రంగవల్లులను చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఆసక్తిగా తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొన్నారు. "అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు రూ.10,116 చొప్పున బహుమతులు అందించాం. మీ జీవితంలో సుఖ సంతోషాలు నిండాలని ఆశిస్తున్నాం" అని భువనేశ్వరి వెల్లడించారు.
దేవాన్ష్ సందడే సందడి
సంక్రాంతి వేడుకల్లో భాగంగా చిన్నారులకు నిర్వహించిన పోటీల్లో సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ సైతం ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఎప్పుడూ స్కూల్స్‌లో ఆడటమే తప్ప ఊళ్లో ఆటల పోటీలు ఎలా ఉంటాయో తెలియని తన మనవళ్లను ఆడించాలని చంద్రబాబు కోరారు. దీంతో నిర్వాహకులు క్రీడలను నిర్వహించారు. గోని సంచితో వేసుకుని దూకుతూ ఆడే పరుగుపందెంలో దేవాన్ష్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు చప్పట్లు కొడుతూ అతన్ని ఎంకరేజ్ చేశారు. నారా దేవాన్ష్ కూడా తన స్నేహితులతో కలిసి సరదాగా ఆడిపాడాడు. దేవాన్ష్ తన స్నేహితులతో ఆడుతూ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పిల్లలు ఆటలతో మునిగిపోయిన ఆ ఆనంద దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
అభివృద్ధి పనులకు శ్రీకారం
సొంత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.1 కోట్లతో జడ్పీ హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. రూ.3 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణం ప్రారంభించారు. మహిళా సంఘాలకు చౌక, నాణ్యమైన నిత్యావసరాలను అందించేందుకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా మహిళలు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం ద్వారా తమ అవసరమైన సరకులను పొందగలరు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com