CBN: వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం

వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో నిర్వహించిన ప్రజావేదికలో పింఛను లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే వైసీపీ పాలనలో ఇష్టానుసారం దోపిడీ చేశారని విమర్శించారు. సర్వే రాళ్ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి వాటిపై కూడా ఫొటోలు వేయించుకున్నారని విమర్శించారు.ఐదేళ్లలో పేదలకు ఇళ్లు కట్టలేదు కానీ, రుషికొండలో ప్యాలెస్ కట్టారని గుర్తు చేశారు. తాము పాలకులం కాదని.... సేవకులమని గుర్తించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. వాస్తవాలు తెలియాలని 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు.
ప్రజల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నామన్న ముఖ్యమంత్రి.... రాళ్ల సీమను రతనాల సీమగా చేసే బాధ్యత తమదన్నారు. పట్టు పరిశ్రమతో మంచి ఆదాయం.. ఉపాధి కల్పన. టీడీపీ హయాంలో సాగునీటికి రూ.68వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. కరవు జిల్లాలో కియా మోటార్స్ తీసుకొచ్చాం. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరవు ఉండదన్నారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. పంటలకు గిట్టుబాటు ధరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మడకశిరలో రూ.60 కోట్లతో రింగ్‌రోడ్డు నిర్మిస్తామన్నారు. ఈ ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తామని.... పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తాం.పేదలందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4లక్షల ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని సీఎం విమర్శించారు. ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదని చెప్పారు. సంపద సృష్టితో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన ‘మన నీరు-మన సంపద’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం తీర్పుపై స్పందించారు. ‘‘సామాజిక న్యాయం, దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెదేపా సిద్ధాంతం. గతంలో వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీలుగా కేటగిరీ తీసుకొచ్చాను. అందరికీ న్యాయం జరగాలి. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశాం. ఈ ప్రభుత్వం అందరిది.. మీ అందరివాడిగా ఉంటా’’ అని చంద్రబాబు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com