CBN: "అప్పట్లోపు పోలవరం పూర్తి చేసి తీరుతాం"

ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందని... కచ్చితంగా ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2027 లోగానే ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ 2027 లోగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. అందులో భాగంగానే బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.15వేల నిధులు కేటాయించారని తెలిపారు. పోలవంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2027 లోగానే ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు కూడా కేంద్రం రూ.11,400 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
అధికారమైనా.. ప్రతిపక్షమే: లోకేశ్
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు కష్టపడాలని దిశా నిర్దేశం చేశారు. వైసీపీ 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమేనని.. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తల్లికి వందనం అమలు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తేల్చిచెప్పారు. దేశం, ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది మనం పవిత్ర దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయానికేనని చెప్పారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడిచేస్తే పట్టించుకోని పరిస్థితి ఆనాటి పాలనలో చూశామని ధ్వజమెత్తారు. కష్టపడిన కార్యకర్తలను మరువద్దని నాయకులను లోకేశ్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com