CBN: ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి: చంద్రబాబు

CBN: ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి: చంద్రబాబు
X
ప్రాజెక్టులు త్వరగా వచ్చేలా చూడాలన్న సీఎం... స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేయాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఎప్పటికప్పుడు సమీక్షించి ఫలితాలు చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సూచించారు. చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ మూడో సమావేశం నిర్వహించారు. ఇందులో 15 ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ.44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.

ప్రాజెక్టులు వచ్చేలా చూడండి

పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు తెలిపారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించి త్వరితగతిన ఫలితాలు చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సూచించారు.

రైతుల సమస్యల పరిష్కారానికిహామీ

రాష్ట్రం వ్యాప్తంగా, ప్రధానంగా గుంటూరు జిల్లా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని. దిద్దుబాటు చర్యలకు వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఈ నెల 12న సీఎం గారికి మిర్చి రైతుల సమస్యలపై లేఖ రాయటంతో పార్లమెంటరీ పార్టీ సమావేశంలోఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

Tags

Next Story