CBN: త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు... కీలక ప్రకటన చేశారు. మిగిలిన నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతం అవడంలో కార్యకర్తల కృషిని చంద్రబాబు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమాన్ని చేపట్టినా వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంటుందని... ఆ విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.**
ఈనెల 9న ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ నెల 9న బెంగళూరుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఓ మీడియా సంస్థ సదస్సులో పాల్గొని ఇద్దరు సీఎంలు వివిధ అంశాలపై చర్చించనున్నారు. సామాజిక న్యాయం, తెలంగాణ ప్రభుత్వం సర్వేపై రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. క్వాంటమ్ వ్యాలీ, ఎడ్యుకేషనల్ హబ్స్, సంకీర్ణ రాజకీయాలు, సుపరిపాలనపై సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com