CBN: సంక్రాంతి వేళ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CBN: సంక్రాంతి వేళ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
X
ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు వినియోగించుకోవాలని ఆదేశం... బకాయిల విడుదలకు ఏపీ సర్కార్ ఆమోదముద్ర

సంక్రాంతి పండగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేేశారు. ప్రధాన పట్టణాల నుంచి గ్రామాలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. వాటిని ఉపయోగించే ముందు ఫిట్ నెస్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని తెలిపారు. ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. . ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు తీసుకోవాలన్నారు. ప్రజలను సురక్షితంగా గ్రామాలకు తీసుకురావాలని అన్నారు.

వేల కోట్ల విడుదలకు ఏపీ సర్కార్ ఆమోదం

సంక్రాంతి పండగ వేళ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మెుత్తం బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారికి చెల్లించాల్సిన రూ.6,700 కోట్ల పెండింగ్ నిధుల విడుదలకు చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పెండింగ్ బిల్లులపై సీఎం సమీక్ష నిర్వహించారు.

చంద్రబాబుకు లోకేశ్ థ్యాంక్స్

ఏపీలో వివిధ వర్గాలకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దశల వారీగా రూ.788 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విద్యార్థులకు తీపి కబురు అందించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఇది సంక్రాంతి కానుక అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

మరో వినూత్న కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం

ఏపీ అభివృద్ధి కోసం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. P4 కాన్సెప్ట్ పేపర్‌ను నేడు విడుదల చేస్తామని తెలిపారు. అన్ని స్థాయిల్లో చర్చలు జరిగాక.. సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని P4 విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అందిస్తామన్నారు.

Tags

Next Story