CBN: బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ

CBN: బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ
X
కీలక చర్చలు జరిగిన చంద్రబాబు... ఏపీ ప్రతిపాదనలపై చర్చిస్తానన్న గేట్స్

దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల వేట కొనసాగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పార్టిసిపేషన్ కోసం వెళ్లిన చంద్రబాబు.. మిషన్ దావోస్‌పై సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నారు. బిల్డింగ్‌ ది నెక్ట్స్ పెట్రోకెమికల్ హబ్ అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ చర్చలో చంద్రబాబు పాల్గొన్నారు . అనంతరం ప్రపంచ ఆర్థిక సదస్సులో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు, ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిను చాలా కాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తన సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

బిల్‌గేట్స్‌తో కీలక చర్చలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారి పోయిన విషయాన్ని బిల్ గేట్స్‌కు... చంద్రబాబు గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గేట్‌వేగా నిలపాలని కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని బిల్స్ గేట్స్‌కు చంద్రబాబు విజ్జప్తి చేశారు. ఏపీలో ప్రపంచ స్థాయి ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని బిల్‌గేట్స్‌ను సీఎం చంద్రబాబు కోరారు. ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని బిల్స్ గేట్స్‌ను చంద్రబాబు కోరారు.

ఏపీ పునర్నిర్మాణమే మా ధ్యేయం

కేంద్రమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని... ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. దానికి కేంద్రం ఎంతో సాయం చేస్తోందన్నారు. 15% వృద్ధి సాధనే లక్ష్యంగా 2047 స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించుకున్నామని. అప్పటికల్లా 45 వేల డాలర్ల తలసరి ఆదాయం సాధించాలనేది లక్ష్యమని తెలిపారు.

Tags

Next Story