CBN: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ

CBN: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు... ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఆయా నిధుల మంజూరుపై ప్రధానితో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఈ నిధుల విడుదలపైనా చంద్రబాబు వాకబు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా వెనకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థికసాయం కింద నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు ఢిల్లీలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని ప్రధానిని చంద్రబాబు కోరారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన 15 వేల కోట్ల రూపాయలు త్వరగా అందేలా చూడాలని ప్రధానినీ ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర విభజన సమస్యలు, పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరనున్నారు. అయితే, అంతకు ముందు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టులా నిర్మాణానికి కావాల్సిన పనులపై చర్చించారు.

Tags

Next Story