CBN: వైసీపీ పాలనలో భారీ ఆర్థిక భారం

CBN: వైసీపీ పాలనలో భారీ ఆర్థిక భారం
X
భారీ మద్యం కుంభకోణం జరిగిందన్న చంద్రబాబు.. ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు.'గత ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలు పేరుకుపోయాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను కూడా మించి అప్పులు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది.' అని ఆయన గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. ఏపీలో మద్యం అమ్మకాల పేరిట జరిగిన భారీ కుంభకోణం ముందు ఢిల్లీ స్కామ్‌ చాలా చిన్నదని చంద్రబాబు అన్నారు. భూఆక్రమణలు, గంజాయి, మాదక ద్రవ్యాలు, అమ్మాయిల అక్రమ సరఫరా వంటి హేయమైన నేరాలకు గత ప్రభుత్వంలో పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం రూపొందించిన రెండు బిల్లులకు ఆమోదం తెలపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కోరినట్టు చంద్రబాబు తెలిపారు.

ప్రజలంతా తమవైపే...

ఏపీ ప్రజలు పూర్తిగా కూటమి వైపే ఉన్నారని చెప్పారు. ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు 60 నుంచి 67.5 శాతానికి పెరిగింది. సంపదను సృష్టించడం, అభివృద్ధి చేయడం, సంక్షేమం, సాధికారికత అనేవి నిరంతర ప్రక్రియ అని చంద్రబాబు వెల్లడించారు. సంపద పెంచకపోతే ఎలా పంచగలం? అప్పులతో ఆర్థిక సుస్థిరత సాధించలేమని చంద్రబాబు అన్నారు. ఏపీలో నాడు జగన్‌ ప్రభుత్వం, ఢిల్లీలో నిన్నటిదాకా కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయని తెలిపారు.

ఢిల్లీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు

ఎన్డీయే సర్కారు అధికారంలో ఉండేందుకు టీడీపీ ఎంపీలు కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో కూడా కూటమి సర్కార్ అధికారంలో ఉండడం సీఎం చంద్రబాబుకు కలిసొస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ హాజరవుతూ, భారీగా నిధులు తీసుకొస్తూ రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో ఢిల్లీలో కూడా చంద్రబాబు చక్రం తిప్పుతున్నారని పార్టీ నేతలు అంటున్నారు.

Tags

Next Story