CBN: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలోని కందుకూరులో పర్యటించనున్నారు. ఆయన ఈ రోజు ఉదయం 11:45 గంటలకి నెల్లూరులోని టీఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగుతారు. దూబగుంట సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్‌ఎఫ్ ఫెసిలిటీ సెంటర్ (వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్)కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
షెడ్యూల్ ఇలా...
ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.05 దూబగుంట శివారులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. 12.20 గంటలకు దూబగుంట గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 1:30 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. 2:40 గంటలకు సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్‌లో ఉండవల్లి బయలు దేరి వెళ్లనున్నారు.
యాసిడ్ దాడిపై స్పందించిన చంద్రబాబు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో యువతిపై యాసిడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. అలాగే యువతికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com