AP: అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు

AP: అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు
X
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులపై చర్చించారు. మొత్తం 23 అంశాలే అజెండాగా అథారిటీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధి పనులకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రూ.2,498 కోట్లతో రహదారుల పనులకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. రూ.1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సీఆర్డీఏ పరిధిలో రూ.3,523 కోట్లతో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల భవనాల నిర్మాణానికి అనుమతి లభించింది. అనుమతులు వచ్చిన పనులు జనవరి నుంచి ప్రారంభం కానున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈనెల 15లోపు ఐదు ఐకానిక్‌ టవర్లకు డిజైన్లు వస్తాయని, నెలాఖరులోపు డిజైన్లు ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు.

రోడ్లకు రూ. 2498 కోట్లు

అమరావతిలో 217 చదరపు కిలోమీటర్లలో రోడ్లు, బిల్డింగ్ లకు కొన్నింటికి అథారిటీ మీటింగ్ లో అనుమతులిచ్చాం అన్నారు.. కొన్ని రోడ్లకు 2498 కోట్లతో వేయడానికి అథారిటీ అనుమతిచ్చింది.. 1585 కోట్లతో మూడు వాగులు, మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి అథారిటీ అనుమతి లభించిందని వెల్లడించారు.. ఇక, రూ.3,523 కోట్లతో అధికారుల బిల్డింగ్ లకు అనుమతి లభించింది.. జనవరి నుంచి అనుమతులు వచ్చిన పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.. అన్ని రకాల వసతులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి నారాయణ..

ఐకానిక్ టెండర్లు పూర్తి

ఐకానిక్ టవర్ల టెండర్లు పూర్తయ్యాయి… డిసెంబర్ 15వ తేదీలోగా డిజైన్‌లు వస్తాయని తెలిపారు మంత్రి నారాయణ.. రైతులకు చేసిన ప్రామిస్ ప్రకారం మూడేళ్లలో పూర్తి చేస్తాం.. SSR రేటు ప్రకారం ఇవ్వడం జరుగుతుంది.. తూర్పు పడమరలలో 17 రోడ్లు 18 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మిస్తామన్నారు.. E5, E7, E9, E13, E16 రోడ్లను పరిశీలించాం.. సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయ్యేలోగా E11, E15 రోడ్లను టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని చెప్పారు.. ఇక, వరల్డ్ బ్యాంకు బోర్డు మీటింగ్‌లో ఒక నిర్ణయం వస్తుందని తెలిపారు .

Tags

Next Story