AP: రక్షణ రంగ బలోపేతానికి ఎన్డీఏ పెద్దపీట

సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు కల్పించుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో శనివారం నిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలని... అందుకే ప్రధాని మోదీ వికసిత్ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారని చంద్రబాబు అన్నారు. అలాంటి రక్షణరంగంలో నౌకాళం చేస్తున్న కృషి అసామాన్యమని కొనియాడారు. నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నారు. సముద్ర రవాణాకు తూర్పునౌకాదళం రక్షణగా నిలిచి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తోందన్నారు. దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తోందని తెలిపారు.
ఆర్థికాభివృద్ధికి సహకరించాలన్న చంద్రబాబు
దేశ భవిష్యత్తు, రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలని తూర్పు నౌకాదళాన్ని సీఎం కోరారు. సముద్ర ఆర్థికవ్యవస్థలో వెనుకంజలో ఉన్నామని.. ఆ రంగంలో బలోపేతానికి నేవీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహాలివ్వాలని చంద్రబాబు తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును పరిరక్షించుకునే దిశగా సాగుతున్నామని, టెక్నాలజీ, ఫార్మా, ఔషధ తయారీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దడానికి ముందుకెళుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబు సంచలన నిర్ణయం.. పెరిగిన మైలేజ్
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఇకపై తెలుగులో రిలీజ్ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. తెలుగు భాషాభివృద్ధి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరుగున పడుతున్న తెలుగు భాషలో వెలుగు నింపేందుకు ప్రభుత్వం తరపున చంద్రబాబు తొలి అడుగు వేశారంటూ ప్రశంసిస్తున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ప్రజల్లో TDP మైలేజ్ పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com