CBN: తిరుమల నుంచే వైసీపీ పాప ప్రక్షాళన

CBN: తిరుమల నుంచే వైసీపీ పాప ప్రక్షాళన
X
ప్రకటించిన చంద్రబాబు....పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మార్చడమే లక్ష్యమని ప్రకటన

వైసీపీ పాపాల ప్రక్షాళన టీటీడీ నుంచే ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సీఎం హోదాలో కుటుంబ సభ్యులతో కలిసి.. తిరుమల, తిరుచానూరు, ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. భువనేశ్వరి, లోకేష్ ,బ్రాహ్మణి, దేవాన్ష్ తో కలిసి సాధారణ క్యూలైన్‌లో ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు తి.తి.దే. జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సీఎం కుటుంబ సభ్యలుకు అర్చకులు వేదాశీర్వచనం చేశారు. తీర్థప్రసాదాలతోపాటు శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. శ్రీవారి ఆలయం నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు అఖిలాండం వద్దకు వెళ్లి కొబ్బరికాయకొట్టారు. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. సుపరిపాలన అందిస్తే ప్రపంచమంతా మనవైపే చూస్తుందన్నారు.


అనంతరం రోడ్డుమార్గాన చంద్రబాబు తిరుచానూరు వెళ్లారు. అక్కడ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేదఆశీర్వచనం పలికి,తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడి నుంచి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు.ఇంద్రకీలాద్రిపై చంద్రబాబుకు దేవదాయ శాఖ కమిషనర్ , ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, దుర్గగుడి EO స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న సీఎంకు వేదపండితులు ఆశీర్వచనం పలికారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారుఇంద్రకీలాద్రికి చంద్రబాబు రాక సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ...ఐదు కీలక ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. 16 వేల 347 పోస్టులతో మెగా DSC ఫైల్ పై...... మొదటి సంతకం చేసిన చంద్రబాబు..... తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు 4 వేలకు పెంపు, నైపుణ్య గణన....., అన్న క్యాంటీన్ ల పునరుద్ధరణ దస్త్రాలపై సంతకాలు పెట్టారు. అంతకుముందు సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు రాజధాని రైతులు అఖండ స్వాగతం పలికారు.

Tags

Next Story