AP: ఎమ్మెల్సీ ఎన్నికలు... రంగంలోకి చంద్రబాబు
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార, ప్రతిపక్షాలు దృష్టి సారించాయి. ఇప్పటికే వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపగా.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. విశాఖ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. టీడీపీలో ఇంకా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీపై స్పష్టత లేనట్లు తెలుస్తోంది. ఇవాళ టీడీపీ అభ్యర్థిరై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థి ఎంపికపై ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అర్బన్‌లో ఎన్ని ఓట్లు.. రూరల్ ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశంపై సమీక్ష నిర్వహించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలను వైసీపీ ఇప్పటికే క్యాంపులకు తరలించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి పార్టీ నేతలు తీసుకెళ్లారు. జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల బలా బలాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు.
విశాఖ రూరల్ నుంచి మరింత సమాచారం తీసుకోవాలని చంద్రబాబు.. విశాఖ నేతలను ఆదేశించారట.. కాగా, స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల బలం.. తమకు ఎక్కువగా ఉన్నందున.. గెలుపు మాదేననే ధీమాలో వైసీపీ ఉంది.. మరి.. కూటమి నేతలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వ్యూహం రచిస్తారనేది ఆసక్తిగా మారింది.
కేంద్రం శుభవార్త
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది . ఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు మంజూరు చేసింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90 కోట్లను మంజూరు చేసిందని.. ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.. కాగా, గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రూ.2934.80 కోట్లు మంజూరు చేసి.. విడుదల చేసిందనీ, అదనంగా ఇప్పుడు రూ.2812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. ఇక, ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టీ.ఓ.ల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని, మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని ఓ ప్రకటనలో తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com