ఏపీలో కరోనా కలకలం.. కొత్తగా 10,825 కేసులు

X
ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,825 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు, 71 మంది కరోనాతో మృతి చెందారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 4,87,331కు చేరింది. అందులో ఇప్పటివరకూ 3,82,104మంది కోలుకోగా.. 1,00,880 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య 4,347కు చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
