AP: అప్పులలో జగన్ సర్కార్ చెత్త రికార్డు

ఆంధ్రప్రదేశ్‌నుఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే ఆశయంఅన్నట్లుగా జగన్ సర్కార్ వేల కోట్లు రూపాయల అప్పులు చేస్తోంది. వాటితో ఏమైనా ఏమైనా ఆస్తులు సృష్టిస్తున్నారా...? అంటే అదీ లేదు. ఉపయోగం లేని అంశాలకే అత్యధికంగా ఖర్చు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న అప్పులో.. ఏకంగా 86శాతం ఉపయోగపడని వ్యయంతో.. జగన్ సర్కార్ చెత్త రికార్డు మూటకట్టుకుంది.
వైకాపా సర్కారు GSDPలో పరిమిత నిష్పత్తికి మించి మరీ రుణాలు తెచ్చుకుంటోంది. ఆస్తుల్నీ తాకట్టు పెడుతోంది. లెక్కకు మిక్కిలి గ్యారంటీలుఇస్తోంది. రాష్ట్ర రెవెన్యూ రాబడిలో అంతకుముందున్న పరిమితిని తనంతట తానే పెంచేసుకుని...అదనపు అప్పులు తీసుకుంటోంది. ఇలా తెచ్చిన అప్పుల్ని మూలధన ఖర్చుగా వినియోగించకుండా.. ఎలాంటి ప్రతిఫలం ఇవ్వని.. రెవెన్యూ వ్యయంగా మార్చేస్తోంది.
జగన్ సర్కారు అనేక అనధికారిక అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తోంది. కార్పొరేషన్ల ద్వారా ఎంత రుణం తీసుకున్నా ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ఎంత అప్పు తెచ్చారనే అంశాలను కాగ్ అడిగినా ప్రతినెలా ఇవ్వడం లేదు. కేవలం బహిరంగ మార్కెట్ రుణాలు లేదా ఇతర రుణాలు కలిపి కాగ్‌కు ఏపీ సర్కారు తెలియజేసిన వివరాల ప్రకారంతెచ్చిన రుణంలో చాలాకొద్ది మొత్తం మాత్రమే ఆస్తులను సృష్టించేందుకు వినియోగిస్తోంది. ఒకవైపు రుణాలు పెద్ద మొత్తంలో ఉంటే మరోవైపు వాటిలో సగమైనా ఆస్తులను సృష్టించేందుకు ఖర్చు చేయడం లేదనేది గమనార్హం. బడ్జెట్ అంచనాల సమయంలోనే మొత్తం ఖర్చులో మూలధన వ్యయం కేటాయింపులు 12 శాతం నుంచి 14 శాతం లోపు ఉంటున్నాయి. అసలు కేటాయింపులే తక్కువ. అలాంటిది ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత చేసిన వాస్తవ ఖర్చు చూస్తే మరీ విస్తుపోవాల్సిన పరిస్థితులు. మొత్తం ఖర్చులో మూలధన వ్యయం కింద 10 శాతమైనా ఖర్చు చేయని దుస్థితి రాష్ట్రంలో ఉంది.
బడ్జెట్ రూపకల్పనకు, అమలుకు 'ఫిస్కల్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ'-ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ఎంతో కీలకం. ఆ చట్టం ప్రకారం రాష్ట్రానికి వచ్చే మొత్తం రాబడులను కలిపితే రెవెన్యూ ఆదాయం అవుతుంది. రాష్ట్ర సొంత రాబడి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లను కలిపితే వచ్చేది... రెవెన్యూ రాబడి. ఈ రెవెన్యూ రాబడికి, మనం చేసే రెవెన్యూ ఖర్చు సమానంగా ఉండాలి. అప్పుడే బడ్జెట్‌లో రెవెన్యూ లోటు ఉండదు. అలాంటి సందర్భంలో తీసుకునే ప్రతి రుణంలో... అత్యధిక భాగాన్ని మూలధన వ్యయం కోసం వినియోగించుకునేందుకు వీలవుతుంది. అంటే... అప్పులు చేసి ఆస్తులను సృష్టించుకునే అవకాశం లభిస్తుంది. కానీ.., రెవెన్యూ వ్యయం కోసమే అప్పులు చేయడం అనేది ప్రమాదకరమైన పరిణామం. జగన్ సర్కారులో అది మరీ విశృంఖలమైంది. ఫలితంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితులను సర్కారే స్వయంగా సృష్టిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com