PAWAN: వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్

గాలివీడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా.. ఇంకా వైసీపీ నేతలు గాల్లో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమ ఎవరి జాగీర్ కాదని, ముఠాలను పట్టుకుని బెదిరిస్తే ఎవరూ భయపడరని తెలిపారు. అతిగా ప్రవర్తిస్తే.. కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. గతంలో ఎంపీడీవో ప్రతా్‌పరెడ్డి, శేఖర్‌నాయక్, శ్రీనివాసులరెడ్డిపై దాడి చేశారని... ఇప్పుడు జవహర్‌బాబుపై దాడి చేశారని పవన్ అన్నారు. వైసీపీ నేతలకు అహంకారం తలకెక్కిందని... తోలుతీసి కూర్చోబెడతామని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. ఆధిపత్యపు అహకారంతో దాడిచేస్తే అహంకారాన్ని అణిచేస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం త్రికరణశుద్ధితో పనిచేస్తోందని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎలా నియంత్రించాలో తెలుసనని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా గాలిలో విహరిస్తున్నారన్నారు. 11 సీట్లే వచ్చినా అహంకారం తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పరామర్శించారు.
ఎలా తిరుగుతావని బెదిరించారు.
ఎలా తిరుగుతావో చూస్తామని ఎంపీడీవోను బెదిరించారని పవన్ అన్నారు. గదిలో తలుపు వేసి అమానుషంగా కొట్టారని... గత ప్రభుత్వంలో మాదిరిగా రెచ్చిపోయారన్నారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదన్నారు. ఆధిపత్య దాడులు చేస్తే ఎదుర్కోండి. మీకు అండగా మేముంటామని రాయలసీమ యువతకు, ప్రజలకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. దాడి చేసిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడేలా వ్యవహరించాలని సూచించారు. క
నకిలీ ఐపీఎస్ అధికారిపై పవన్ రియాక్షన్
ఇటీవల మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు, ఒక నకిలీ ఐఏఎస్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నకిలీ పోలీస్ పై మీడియా ముఖంగా పవన్ స్పందించారు. "ఒక నకిలీ ఐపీఎస్ అధికారి నా చుట్టూ తిరిగాడని అంటున్నారు. అధికారి ఎవరనేది నాకు తెలియదు. ఈ అంశాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఇంటిలిజెన్స్, డీజీపీదేనని పవన్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com