PAWAN: నేటి నుంచి పవన్‌ కల్యాణ్ దీక్ష

PAWAN:  నేటి నుంచి పవన్‌ కల్యాణ్ దీక్ష
X
11 రోజుల పాటు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష... విధుల్లో ఉంటూనే దీక్ష చేయనున్న పవన్

తిరుమల ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిన ఘటనకు ప్రాయశ్చిత్తంగా నేటి నుంచి గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. దైనందిన విధుల్లో పాల్గొంటూనే 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఉండాలి.. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా .. అన్ని వర్గాల్లో చర్చ జరగాలి అని పవన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ స్పందన వెనుక లోతైన అర్థం ఉండటంతో పలువురు స్పందించారు. ఇందులో ప్రకాష్ రాజ్ ఒకరు. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా చేసి.. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఓ బోర్డును ఏర్పాటు చేయాలన్న సూచన చేశారు. ఇలాంటివి వస్తే.. హిందూత్వ రాజకీయాలు చేసే బీజేపీ ఎలా అందుకుంటుందో ప్రకాష్ రాజ్ కు తెలుసు. అందుకే.. అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని శిక్షించాలని సలహా ఇచ్చారు. దీనికి పవన్ రిప్లయ్ ఇవ్వలేదు కానీ .. ఆయన రాజకీయంపై మాత్రం అందరికి ఈ క్లారిటీ వచ్చినట్లయింది.


నిజానికి పవన్ కల్యాణ్ తన భావజాలం.. కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుందని చాలా సార్లు చెప్పారు. అందుకే ఓ సారి ఆ పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు కానీ బీజేపీ రేంజ్ హిందూత్వ వాదాన్ని ఎప్పుడూ వినిపించలేదు. ఇప్పుడు లడ్డూ వివాదంలో మాత్రం సనాతన ధర్మం గురించి మాట్లాడి అందర్నీ ఆశ్చర్య పరిచారు. పవన్ కల్యాణ్ దీర్ఖకాలిక రాజకీయ వ్యూహంతో ముందుడుగు వేస్తున్నారని.. ఆయన ఆలోచనల వెనుక ఖచ్చితంగా బీజేపీ ప్రభావం ఉందని అంటన్నారు. దీనికి కారణం.. దేశంలోని ప్రముఖ అథ్యాత్మిక ఆలాయలు అధ్యాత్మిక వాదుల చేతుల్లోనే ఉండాలని రాజకీయ జోక్యం ఉండకూడదన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో సనాతన రక్షణ బోర్డు ప్రస్తావనను పవన్ తీసుకు వచ్చారు. ఇది ఏపీకి కాదు.. దేశం మొత్తం గురించి ఆయన తెచ్చిన ప్రస్తావన.

నేడే జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్​లో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య...ఆయన వియ్యంకుడితో కలిసి నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన సమయంలో జగన్‌పై రోశయ్య తీవ్ర విమర్శలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికే పదవులు ఇచ్చారని మండిపడ్డారు.

Tags

Next Story