AP PRC: పీఆర్‌సీపై ఉద్యోగుల అసంతృప్తి.. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన..

AP PRC: పీఆర్‌సీపై ఉద్యోగుల అసంతృప్తి.. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన..
AP PRC: ఎంప్లాయిస్ అసంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు.

AP PRC: ఏపీ సర్కారు ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌కు ఉద్యోగ సంఘాల నేతలు అంగీకారం తెలిపినా.. ఎంప్లాయిస్ అసంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. పీఆర్సీతో ప్రయోజనం లేకపోగా.. నష్టదాయకంగా ఉందని ఆరోపించారు. విజయనగరంలో జరిగిన ఉద్యోగుల చైతన్యవేదికలో ఆయన పాల్గొన్నారు. PRC విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలన్నారు.

కాలయాపన చేయకుండా CPS రద్దుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సూర్యనారాయణ. లక్షా 30వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొహిబిషన్ డిక్లేర్ చేసి, PRC అమలు పరిచేంత వరకు పోరాడుతామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలన్నారు. HRC తగ్గితే ఊరుకునేది లేదని హెచ్చరించారు సూర్యనారాయణ.

ప్రభుత్వం పీఆర్సీ అంశంలో పునరాలోచించుకోవాలన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వినుకొండ రాజారావు. పీఆర్సీ కమిటీ రిపోర్ట్ లేకుండా చర్చలకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ వద్ద నోరు మెదపలేకపోవడం బాధాకరమన్నారు.

స్వప్రయోజనాల కోసం ప్రభుత్వం, ఉద్యోగసంఘాల నాయకులు ఉద్యోగులను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.వేతన సవరణపై ఉద్యోగులంతా అసంతృప్తిగానే ఉన్నా ఇప్పటికిప్పుడు ఆందోళన చేపట్టేందుకు తాము మానసికంగా సిద్ధంగా లేమంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. అటు ప్రభుత్వం, ఇటు JACనేతల తీరుతో నలిగిపోతున్నారు ఉద్యోగులు.

Tags

Read MoreRead Less
Next Story