AP PRC: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ డిమాండ్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్..

AP PRC: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ డిమాండ్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్..
AP PRC: ఉద్యోగుల పోరాటం ఫలిచింది. పీఆర్సీ సాధన సమితి డిమాండ్లకు సర్కారు తలొగ్గింది.

AP PRC: ఉద్యోగుల పోరాటం ఫలిచింది. పీఆర్సీ సాధన సమితి డిమాండ్లకు సర్కారు తలొగ్గింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు వెళ్లకుండానే సమస్యలకు ముగింపు పలికింది. నిన్న అర్థరాత్రి వరకు ఒకసారి.. ఇవాళ మధ్యాహ్నం మరోసారి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించింది. సీఎస్, మంత్రుల కమిటీ.. ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఉద్యోగుల డిమాండ్లపై సుధీర్ఘంగా చర్చించారు. ఫిట్‌మెంట్, ఐఆర్ రికవరీ, హెచ్ఆర్ఏ అంశాలతో పాటు పలు సమస్యలపై చర్చించిన మంత్రుల కమిటీ.. ఉద్యోగ సంఘాల పీఆర్సీ పోరుకు పుల్‌స్టాప్ పెట్టారు.

సెక్రటేరియట్ రెండవ బ్లాక్‌లో సుధీర్ఘంగా జరిగిన చర్చల్లో మంత్రుల కమిటీ.. HRA విషయంలో 4 స్లాబ్‌ల కొత్త ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. అయితే ఫిట్‌మెంట్‌ 23 శాతమే ఇస్తామని మరోసారి తేల్చిచెప్పింది. ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలుకు మంత్రుల కమిటీ సుముఖత వ్యక్తం చేసింది. ఐఆర్ రికవరీ చేయబోమని స్పష్టంచేసింది. ఇక మరో ప్రధానమైన డిమాండ్ అయిన సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణను వేగవంతం చేస్తామని తెలిపింది మంత్రుల కమిటీ.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాత కొత్త పీఆర్సీ వేతనం ఇస్తామని పేర్కొంది. అలాగే మట్టి ఖర్చులక 25 వేలు ఇచ్చేందుకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. అయితే ఆరోగ్య కార్డులు అనారోగ్య కార్డులుగా మారాయని స్టీరింగ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేయగా.. హెల్త్‌కార్డుల్లో మార్పులు చేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. ఇంకా చర్చించాల్సిన అంశాలపై అనామలీస్ కమిటీకి పంపుతామని మంత్రుల బృందం.. ఉద్యోగ సంఘాల నాయకులకు స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story