AP:నేడు టీడీపీలో చేరనున్న ఆళ్ల నాని

వైసీపీ అధినేత జగన్ విధానాలను నిరసిస్తూ ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరిగిపోతంది. ఇప్పటికే కీలక నేతలందరూ వైసీపీని వీడగా... ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని నేడు సైకిల్ ఎక్కబోతున్నారు. రెండు నెలల క్రితం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వా నికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన సైలెంట్‌గా ఉన్నారు. తరువాత టీడీపీ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. పైకి సమాచారం పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుం టూనే తెలుగుదేశంలో చేరేందుకు ఆళ్ల నాని తన శక్తియుక్తులను ఉపయోగించారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన టీడీపీలో చేరతారని కొన్నాళ్ల క్రితమే ప్రచారం సాగింది. చాలామంది ఇదే పంథా అనుసరించారు. స్థానిక టీడీపీ నాయకత్వం సైతం ఆళ్ల నాని టీడీపీలో చేరికను తోసిపుచ్చింది. తాము బలంగా ప్రజా మోదంతో గత ఎన్నికల్లో 62 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందితే పార్టీకి ఆళ్ల నాని అవసరం ఏమిటన్నట్టుగా కిందిస్థాయి కేడర్ వ్యాఖ్యానిం చారు. టీడీపీలో చేరతారన్న ప్రచారాన్ని ఖరారు చేసేం దుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. గడిచిన రెండు నెలలుగా టీడీపీలో ఓ ముఖ్య నేత ఆళ్ల నానికి మద్దతుగా నిలిచి ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి దాదాపు అన్ని రూట్లను క్లియర్ చేసినట్టు భావిస్తున్నారు. పార్టీ అధి నాయకత్వం కూడా ఆళ్ల నాని విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించి తదుపరి ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కాంగ్రెస్ కు రాజీనామా చేసి మరీ..
ఆళ్ల నాని వైసీపీ ఆవిర్భావం సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరారు. వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా గడిచిన రెండున్నర దశాబ్దాల నుంచి ఆయన కొనసాగుతూ వచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అంతలా వైసీపీలో ఆయన ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడి గా, విభజిత ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడమే కాకుండా ఎమ్మెల్సీగా కొన్నాళ్లు వ్యవహరించారు.
వ్యతిరేకిస్తున్న టీడీపీ కేడర్..!
ఏలూరులో ఎటువంటి అడ్డంకులు లేకుండా పార్టీ సభ్యత్వ నమోదు, పాలనా వ్యవహారాల్లో ఏకచత్రాధిపత్యంగా ఎమ్మెల్యే బడేటి చంటి, ఆయన వెంట ఉన్న కేడర్ ఉత్సాహంగా ఉన్నారు. ఆళ్ల నాని చేరిక అంటూ ప్రచారం జరిగినప్పుడే కేడరంతా దాదాపు వ్యతిరేకించారు. ఎమ్మెల్యే చంటి మాత్రం దీనిపై ఎక్కడా నోరు మెదపకుం డా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆళ్ల నానిని తిరిగి పార్టీలో చేర్చుకుంటే తిరిగి వ్యవహారం మారుతుందన్న వాదనే అత్యధికుల్లో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com